కరోనా తెలివయిందయితే మేము అంతకన్నా తెలివైన వాళ్ళం: డోనాల్డ్ ట్రంప్

ABN , First Publish Date - 2020-04-07T20:58:14+05:30 IST

కరోనా వైరస్ కంటికి కనిపించని ఓ భయంకరమైన శత్రువుని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అన్నారు.

కరోనా తెలివయిందయితే మేము అంతకన్నా తెలివైన వాళ్ళం: డోనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: కరోనా వైరస్ కంటికి కనిపించని ఓ భయంకరమైన శత్రువని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రజల ప్రాణాలను సునాయాసంగా తీస్తున్న ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై తాము ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూనే ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. 'కరోనా శక్తిమంతమైంది, తెలివైంది కావచ్చు.. కానీ మేము అంతకన్నా తెలివైన వాళ్ళం'అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు కరోనా వల్ల దేశంలోనే ఎక్కువ మరణాలు సంభవించిన న్యూయార్క్ నగరంలో ప్రస్తుతం రోజువారీ మరణాల సంఖ్య తగ్గుతోందని, ఇది మంచి పరిణామమని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు అమెరికాలో 3,67,650 కరోనా కేసులు నమోదవగా 10,943 మంది మృత్యువాత పడ్డారు.

Read more