మేం పూర్తి సన్నద్ధంగా ఉన్నాం

ABN , First Publish Date - 2020-09-17T08:03:33+05:30 IST

చర్చల పేరుతో కాలయాపన చేయడమే తప్ప ఫలితం కనిపించకపోవడంతో.. ‘ఆపరేషన్‌ స్నో లెపర్డ్‌’ను చేపట్టి ఈ ప్రాంతాలపై భారత్‌ పట్టు సాధించింది...

మేం పూర్తి సన్నద్ధంగా ఉన్నాం

  • ముందుకొచ్చిన చైనీయులు వెనక్కి వెళ్తారని మూడు నెలలు వేచి చూసిన భారత సైన్యం
  • పరిస్థితిలో మార్పులేకపోవడంతో పక్కా వ్యూహం
  • పాంగాంగ్‌ సమీపంలోని కీలక ప్రాంతాల స్వాధీనం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: చర్చల పేరుతో పైకి నంగనాచి కబుర్లు చెబుతూ.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా భారత భూభాగాన్ని ఆక్రమిస్తూ సరిహద్దులను మార్చే కుటిలయత్నాలకు పాల్పడిన డ్రాగన్‌ దేశానికి మన సైన్యం ఎలా బుద్ధి చెప్పింది? లద్దాఖ్‌ ప్రాంతంలో మనదేశానికి వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన పర్వతాలను ఎలా పదిలపరచుకుంది? ‘ఆపరేషన్‌ స్నో లెపర్డ్‌’ పేరుతో భారత్‌ విజయవంతంగా సాధించిన ఈ ఘనతకు సంబంధించిన వివరాలతో ‘ఇండి యా టుడే’ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథ నం ప్రకారం.. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు ప్రాం తంలో పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనా ముందుకు చొచ్చుకొచ్చింది. చైనా సైనికులు వెనక్కి తగ్గుతారేమోనని భారతదేశం 3 నెలలు వేచి చూసింది. చర్చల పేరుతో కాలయాపన చేయడమే తప్ప ఫలితం కనిపించకపోవడంతో.. ‘ఆపరేషన్‌ స్నో లెపర్డ్‌’ను చేపట్టి ఈ ప్రాంతాలపై భారత్‌ పట్టు సాధించింది. ఇందులో భాగంగా తొలుత.. భారత్‌కు ఏయే పర్వతప్రాంతాలు వ్యూహాత్మకంగా ప్రయోజనకరమైనవో గుర్తించా రు. అలాంటి ఎత్తైన ప్రాంతాల్లో యుద్ధవ్యూహాలను అద్భుతంగా అమలు చేయగల ‘మౌంటెయిన్‌ వార్‌ఫేర్‌ స్పెషలిస్టు’లతో పలు బృందాలను ఏర్పాటు చేశారు. వ్యూహాల అమలు లో వారు నిపుణులు కావడంతో.. పాంగాంగ్‌ సరస్సుకు దక్షిణ దిక్కులోని రెజాంగ్‌ లా, రెక్విన్‌ లా ప్రాంతాలు, ఉత్తర దిక్కుల్లో మరికొన్ని పోస్టులను వారు స్వీయ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దీంతో చర్చల్లో భారత్‌ది పై చేయిగా మారింది..


పంజాబీ పాటలు.. హిందీలో హితబోధలు

మన దళాలపై చైనా మానసిక యుద్ధం

లద్దాఖ్‌ సరిహద్దుల్లో సై అంటే సై అన్నట్టుగా ఢీకొడుతున్న భారత సైన్యంపై మానసికంగా ఒత్తిడి తెచ్చే వ్యూహాలకు చైనా పదును పెట్టింది. ‘శత్రువుతో యుద్ధం చేయకుండానే వారిని జయించడం గొప్ప యుద్ధ కళ’ అని చైనా యుద్ధ వ్యూహనిపుణుడు సుంజు ఆరో శతాబ్దంలో రాసిన ‘ఆర్ట్‌ ఆఫ్‌ వార్‌’ పుస్తకంలోని వ్యూహాన్ని ఇప్పుడు అమలు చేస్తోంది. ‘ఆపరేషన్‌ స్నో లెపర్డ్‌’ ద్వారా ఆగస్టు 29-30 తేదీల్లో భారత సైన్యం చేజిక్కించుకున్న రెజాంగ్‌ లా, రెచిన్‌ లా ప్రాంతాల్లో తిరిగి ప ట్టు సాధించేందుకు తొలుత ఆయుధ బలాన్ని నమ్ముకొంది. యుద్ధ ట్యాంకులను, ఇతర వాహనాలను అక్కడికి తరలించి భయపెట్టే ప్రయత్నం చేసింది. భారత్‌ దానికి దీటుగా బదులివ్వడంతో.. ఫింగర్‌ 4 వద్ద పెద్ద పెద్ద లౌడ్‌ స్పీకర్లు పెట్టి పంజాబీ పాటలను ప్లే చేయ డం ద్వారా మన దళాల దృష్టి మళ్లించే ప్రయత్నం చే సింది. అలాగే.. చుషుల్‌ సెక్టార్‌లోని మోల్డో గారిసన్‌లో ఉన్న తమ శిబిరం వద్ద పెద్ద సంఖ్యలో లౌడ్‌ స్పీకర్లను పెట్టి.. స్వచ్ఛమైన హిందీలో మన దళాలకు వినిపించేలా ‘హితబోధ’లు చేయడం మొదలుపెట్టింది. ఢిల్లీలోని రాజకీయ నేతల కోసం ఎత్తైన పర్వత ప్రాంతాల్లో చలికాలంలో ఉండడం ఎంత నిరర్థకమో చెప్పనారంభించింది. తద్వారా మన సైనికుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీసి.. వారిలో అసంతృప్తిని పెంచే ప్రయత్నమే ఇదం తా. కాగా.. 1962 లోనూ చైనా సైన్యం ఇవే వేషాలు వేసిందని, 1967లో నాథులా ఘర్షణల సమయంలోనూ ఇలాగే చేసిందని మాజీ ఆర్మీ చీఫ్‌ ఒకరు చెప్పారు. 

Updated Date - 2020-09-17T08:03:33+05:30 IST