గోవధ నిరోధక బిల్లును వ్యతిరేకిస్తాం: సిద్ధారామయ్య

ABN , First Publish Date - 2020-12-01T21:11:07+05:30 IST

గోవధ నిరోధక బిల్లును వ్యతిరేకిస్తాం: సిద్ధారామయ్య

గోవధ నిరోధక బిల్లును వ్యతిరేకిస్తాం: సిద్ధారామయ్య

బెంగళూరు: గోవధ నిరోధక బిల్లును తాము స్థానికంగా వ్యతిరేకిస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధారామయ్య అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) తయారు చేసిన బిల్లులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాకుండా.. ఆర్ఎస్ఎస్ అజెండాకు ప్రాధాన్యమిస్తున్న మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందని సిద్ధారామయ్య విమర్శించారు.


‘‘గోవధను నిరోధించే బిల్లును ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పశుమాంసం విక్రయంపై ఆధారపడి జీవిస్తున్న వారు రోడ్డున పడకూడదు అంటే ఈ బిల్లును వ్యతిరేకించాల్సిందే. దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీయేనైనా, ఆర్ఎస్ఎస్ పాలన సాగిస్తున్నది. నిజానికి ఆర్ఎస్ఎస్ తయారు చేస్తున్న బిల్లుల్నే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రజల అవసరాలను కాకుండా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు, ఆలోచనా విధానాలకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది’’ అని కర్ణాటక అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్షనేత సిద్ధారామయ్య అన్నారు.

Updated Date - 2020-12-01T21:11:07+05:30 IST