పంజాబ్ రైతుల్ని ఢిల్లీకి రాకుండా అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-11-25T23:27:36+05:30 IST

వ్యవసాయ బిల్లుల్ని రద్దు చేయాలంటూ పంజాబ్ రైతులు ఢిల్లీకి బయల్దేరారు. కొంత మంది రైతులు హర్యానాలోని కురుక్షేత్రకు చేరుకున్నారు. అయితే వారిని ఢిల్లీ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు

పంజాబ్ రైతుల్ని ఢిల్లీకి రాకుండా అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ: ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా అనేక మంది రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక పంజాబ్, హర్యానాల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పంజాబ్‌లో కొద్ది రోజులుగా రైళ్ల రాకపోకపలు నిలిచిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోచవ్చు.


కాగా, వ్యవసాయ బిల్లుల్ని రద్దు చేయాలంటూ పంజాబ్ రైతులు ఢిల్లీకి బయల్దేరారు. కొంత మంది రైతులు హర్యానాలోని కురుక్షేత్రకు చేరుకున్నారు. అయితే వారిని ఢిల్లీ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రైతులు.. అక్కడే నిరసనకు దిగారు. పోలీసులు చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా నిరసన కొనసాగించారు. దీంతో రైతులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కెనాన్‌లను ప్రయోగించాల్సి వచ్చింది. ప్రస్తుతం కురుక్షేత్రలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని స్థానిక పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-11-25T23:27:36+05:30 IST