క్షమాపణలు చెప్పే ఓ గోప్ప అవకాశాన్ని అమెరికా కోల్పోయింది...
ABN , First Publish Date - 2020-04-01T22:00:24+05:30 IST
ఇరాన్ అధ్యక్షుడు హసన్ రూహానీ అమెరికాపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. కరోనా కలకలం నేపథ్యంలో ఇరాన్‌పై ఆంక్షలు తొలిగించే చారిత్రాత్మక అవకాశాన్ని అమెరికా కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

దుబాయ్: ఇరాన్ అధ్యక్షుడు హసాన్ రూహానీ అమెరికాపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. కరోనా కలకలం నేపథ్యంలో ఇరాన్‌పై ఆంక్షలు తొలగించే చారిత్రాత్మక అవకాశాన్ని అమెరికా కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆంక్షలు.. కరోనాపై పోరాడుతున్న ఇరాన్ స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయని ఆయన అన్నారు. ‘ఇరాన్‌పై ఆంక్షలు తొలగించే మంచి అవకాశాన్ని అమెరికా కోల్పోయింది. క్షమాపణలు చెబుతూ ఇరాన్‌పై విధించిన అన్యాయమైన ఆంక్షలు తొలిగించే గొప్ప అవకాశం అది’ అని హసాన్ రోహానీ వ్యాఖ్యానించారు. కరోనా విలయం నేపథ్యంలో ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలు తొలగించే అవకాశం ఉందని ఆమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో వ్యాఖ్యనించిన మరుసటి రోజు హసన్ రూహానీ ఈ వ్యాఖ్యలు చేయండ ప్రధాన్యం సంతరించుకుంది.