కేంద్రానికి చేతులు జోడించి చెప్పాలనుకుంటున్నా: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-12-28T01:30:18+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతుల చేస్తున్న ఉద్యమం కొనసాగుతోంది.

కేంద్రానికి చేతులు జోడించి చెప్పాలనుకుంటున్నా: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతుల చేస్తున్న ఉద్యమం కొనసాగుతోంది. ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ వేలాదిమంది రైతులు రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలు ఆదివారం సింఘు సరిహద్దును సందర్శించారు. అక్కడ ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన పంజాబ్ అకాడమీ నిర్వహించిన కీర్తన్ దర్బార్‌లో పాల్గొన్నారు. ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సంగీత కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. వీరందరూ మనవారేనని కేంద్రానికి చేతులు జోడించి చెప్పాలనుకుంటున్నాని అన్నారు. కేంద్రం, రైతుల నేతల మధ్య చర్చ జరిగితే ఈ చట్టాలు ఎంత ప్రమాదకరమైనవో దేశం మొత్తానికి తెలుస్తుందని అన్నారు.  


Updated Date - 2020-12-28T01:30:18+05:30 IST