విశాఖ కేంద్రంగా వెంటిలేటర్ల తయారీ
ABN , First Publish Date - 2020-04-01T08:22:55+05:30 IST
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలను కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. నమూనాల సేకరణ, పరీక్షల...

న్యూఢిల్లీ, మార్చి 31: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలను కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. నమూనాల సేకరణ, పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన అధికారులతో చర్చించారు. వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు, ఇమేజింగ్ ఎక్వి్‌పమెంట్‌ను అభివృద్ధి చేసే యూనిట్ విశాఖపట్టణం కేంద్రంగా ఏప్రిల్ మొదటివారంలో ఉత్పత్తిని ఆరంభించనుందని అధికారులు మంత్రికి వివరించారు.