వీసా, ఓసీఐ కార్డుల సస్పెన్షన్‌తో ఇక్కట్లు

ABN , First Publish Date - 2020-05-13T07:38:17+05:30 IST

కేంద్రం విధించిన ఆంక్షలు.. ప్రస్తుతం అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకు ప్రతిబంధకంగా మారాయి. అనేక మంది భారత్‌కు వచ్చే అవకాశం, అనుమతి ఉన్నా రాలేని విచిత్ర పరిస్థితి...

వీసా, ఓసీఐ కార్డుల సస్పెన్షన్‌తో ఇక్కట్లు

వాషింగ్టన్‌, మే 12: కేంద్రం విధించిన ఆంక్షలు.. ప్రస్తుతం అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకు ప్రతిబంధకంగా మారాయి. అనేక మంది భారత్‌కు వచ్చే అవకాశం, అనుమతి ఉన్నా రాలేని విచిత్ర పరిస్థితి ఇది. విదేశాల్లో చిక్కుకున్న వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్‌ మిషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే హెచ్‌1బీ వర్క్‌ వీసా లేదా గ్రీన్‌కార్డు ఉన్న భారతీయుల పిల్లలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. కరోనా కట్టడికి అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం.


విదేశీయుల వీసాతో పాటు వీసా అవసరం లేకుండా భారత్‌కు వచ్చే వెసులుబాటు ఉన్న ‘ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ)’ కార్డులపై కేంద్రం గత నెల నిషేధం విధించింది. పలువురు హెచ్‌1బీ, గ్రీన్‌కార్డుదారుల పిల్లలు అక్కడే పుట్టడంతో వారంతా ఓసీఐ పరిధిలోకి వస్తారు. ఈ నిబంధన కారణంగా విమానం ఎక్కకుండా వారిని సిబ్బంది అడ్డుకుంటున్నారు. గత్యంత రం లేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు సైతం తిరుగుముఖం పట్టాల్సి వస్తోంది.


Updated Date - 2020-05-13T07:38:17+05:30 IST