భారత్-అమెరికా శాస్త్రవేత్తలకు ‘వర్చువల్’ వేదిక
ABN , First Publish Date - 2020-08-12T07:58:28+05:30 IST
కరోనాపై కదనానికి భారత్, అమెరికా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ‘వర్చువల్’ వేదికగా కలిసికట్టుగా పనిచేయనున్నారు. కొంగొత ఆవిష్కరణలు, పరిజ్ఞానాన్ని పరస్పరం బదిలీ చేసుకోనున్నారు...

హ్యూస్టన్, ఆగస్టు 11 : కరోనాపై కదనానికి భారత్, అమెరికా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ‘వర్చువల్’ వేదికగా కలిసికట్టుగా పనిచేయనున్నారు. కొంగొత ఆవిష్కరణలు, పరిజ్ఞానాన్ని పరస్పరం బదిలీ చేసుకోనున్నారు. ఇందుకు ‘భారత్-అమెరికా శాస్త్ర-సాంకేతిక సహాయక నిధి’ (ఐయూఎ్సటీఈఎఫ్) నుంచి సహాయ సహకారాలు అందనున్నాయి. ‘ఆరోగ్య, వైద్యరంగ పరిశోధనల్లో భారత్- అమెరికా భాగస్వామ్యం’ అనే అంశంపై మంగళవారం జరిగిన వెబినార్లో అమెరికాలోని భారత రాయబారి తరంజిత్సింగ్ సంధు ఈవివరాలను వెల్లడించారు. కరోనా, వైద్య రంగ సహాయక ఉత్పత్తుల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్న ఇరుదేశాల పరిశోధనా సంస్థలు, శాస్త్రవేత్తలకు ఈ నిధి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుందన్నారు. దీంతోపాటు వారు కలిసి పనిచేసేందుకు అవసరమైన ప్రత్యేక ‘వర్చువల్’ వేదిక కూడా ఏర్పాటవుతుందని వెల్లడించారు.