160 టికెట్ల లాటరీ కొట్టాడు

ABN , First Publish Date - 2020-12-13T08:32:24+05:30 IST

వంద లాటరీ టికెట్లు కొన్నామంటే, అందులో ఒక్కటి తగిలినా అదృష్టవంతులమని సంబరపడిపోతాం. అయితే, అమెరికాలోని వర్జీనియా రాష్ర్టానికి చెందిన క్వామే క్రాస్‌ 160 లాటరీ టికెట్లు కొనగా, ప్రతి టికెట్‌లోనూ ఆయన్ని అదృష్టం వరించింది...

160 టికెట్ల లాటరీ కొట్టాడు

  • కొన్న ప్రతి టికెట్‌పైనా వరించిన అదృష్టం
  • రూ.5.89 కోట్లు గెలుచుకున్న వర్జీనియా వాసి

వర్జీనియా, డిసెంబరు 12: వంద లాటరీ టికెట్లు కొన్నామంటే, అందులో ఒక్కటి తగిలినా అదృష్టవంతులమని సంబరపడిపోతాం. అయితే, అమెరికాలోని వర్జీనియా రాష్ర్టానికి చెందిన క్వామే క్రాస్‌ 160 లాటరీ టికెట్లు కొనగా, ప్రతి టికెట్‌లోనూ ఆయన్ని అదృష్టం వరించింది. అన్నీ 7,3,1,4 అంకెల కాంబినేషన్‌లో ఉన్న లాటరీ టికెట్లనే ఆయన కొన్నారు. ప్రతి సిరీ్‌సలోనూ గరిష్ఠ బహుమతి ఆయననే వరించడం విశేషం. మొత్తంగా రూ.5.89 కోట్లు(8 లక్షల డాలర్లు)ను ఆయన అందుకోనున్నారు. తొలుత తాను నమ్మలేదని, 82 సార్లు పరిశీలించిన తర్వాతే తనకు నమ్మకం కలిగిందని వివరించారు. లాటరీ తగిలితే ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ పెడదామనుకున్నానని, ఇంత డబ్బుతో ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని క్రాస్‌ వెల్లడించారు. కాగా, గతంలో రేమండ్‌ హర్రింగ్‌టన్‌ అనే వ్యక్తి 25 లాటరీ టికెట్లు కొనగా, అతనికీ ప్రతి టికెట్‌పైనా లాటరీ తగిలింది. 


Updated Date - 2020-12-13T08:32:24+05:30 IST