చైనాలో కల్లోలం: రెచ్చిపోయిన ప్రజలు..చెలరేగిన హింస!

ABN , First Publish Date - 2020-03-29T01:51:08+05:30 IST

చైనాలో కల్లోలం చెలరేగింది. కరోనాకు కేంద్రమైన హూబే ప్రావిన్స్‌పై ఆంక్షలు ఎత్తివేయడంతో.. అక్కడి ప్రజలు పొరుగున్న ఉన్న జియాంగ్జీ ప్రావిన్స్‌కు పోటెత్తారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ హింస చెలరేగింది. ఆందోళన కారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.

చైనాలో కల్లోలం: రెచ్చిపోయిన ప్రజలు..చెలరేగిన హింస!

బీజింగ్: చైనాలో కల్లోలం చెలరేగింది. కరోనాకు కేంద్రమైన హూబే ప్రావిన్స్‌పై ఆంక్షలు ఎత్తివేయడంతో.. అక్కడి ప్రజలు శుక్రవారం నాడు పొరుగున్న ఉన్న జియాంగ్జీ ప్రావిన్స్‌కు పోటెత్తారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ హింస చెలరేగింది. ఆందోళనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ రెండు ప్రావిన్స్‌‌లను కలుపుతూ యాంగ్ట్‌జీ నదిపైన నిర్మించిన ఓ వంతెన ఉంది. ఆంక్షలు ఎత్తేసారని తెలియగా ప్రజలు ఒక్కసారిగా పొరుగు ప్రావిన్స్‌ వైపు వెళ్లారు. అయితే అప్పటికే వంతెనపై ఇరు ప్రావిన్సుల పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కరోనాను తప్పించుకోవచ్చన్న ఆశతో ఉన్న ప్రజలకు.. వంతెన పై ఉన్న బ్యారికేడ్లు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.


దీనికి తోడు గ్రీన్ కోడ్ ఉన్న వారినే అనుమతిస్తామంటూ జియాంగ్జీ పోలీసులు తెల్చిచెప్పడంతో అక్కడికొచ్చిన వారి మనోభావాలు గాయపడ్డాయి. అదే సమయంలో ఇరు ప్రావిన్స్‌లు పోలీసుల మధ్య కూడా తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎవర్ని అనుమతించాలి ఎవర్ని వద్దు అన్న దానిపై అనేక కారణాల వల్ల ఏకాభ్రిప్రాయం కుదరక వారి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ప్రజలు.. అక్కడున్న పోలీసు వాహనాలను బోల్తాపడేసారు. అయితే పోలీసులు ఎంతో వ్యవప్రయాసలకోర్చి ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం..రెండు రాష్ట్రాల అధికారులు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. వంతెనపై ఉన్న బ్యారికేడ్లను తొలగించడంతో పాటూ ఎవరెవర్ని అనుమతించాలనే దానిపై ఏకాభిప్రాయాని వస్తామని వారు తెలిపారు. 

Updated Date - 2020-03-29T01:51:08+05:30 IST