లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన.. లక్ష వాహనాలు సీజ్

ABN , First Publish Date - 2020-06-28T19:55:50+05:30 IST

కరోనా కట్టడికి చెన్నైలో సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉంది.

లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన.. లక్ష వాహనాలు సీజ్

చెన్నై: కరోనా కట్టడికి చెన్నైలో సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉంది. అయినా కొంతమంది లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. సరైనా ఆధారాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. నగరంలో ఎక్కడికక్కడ పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీసులు, పాసులు ఉన్న వాహనాలు తప్ప మిగతా వాహనదారులను ఎక్కడికక్కడ ఆపుతున్నారు.  


లాక్ డౌన్ సమయంలో పోలీసులు లక్ష వాహనాలను సీజ్ చేశారు. ఇందులో వేలాది కార్లు, బైకులు, ఆటోలు ఉన్నాయి. సీజ్ చేసిన వాహనాలను పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే పీఎస్‌లు నిండిపోవడంతో ఖాళీ ప్రదేశంలో వాహనాలు ఉంచారు. అవి కూడా నిండిపోవడతో విశాలంగా ఉన్న రోడ్లపై నిలిపారు. లక్ష వాహనాలు సీజ్ చేయడంతో వాహనదారులు పరేషాన్ అవుతున్నారు. లాక్ డౌన్ ఎప్పటి వరకు కొనసాగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వాహనాలు ఎలా విడిపించుకోవాలో తెలియక తల్లడిల్లుతున్నారు.

Updated Date - 2020-06-28T19:55:50+05:30 IST