ఈవీఎం పనిచేయలేదని ఎన్నిక బహష్కరించారు...
ABN , First Publish Date - 2020-10-28T16:47:12+05:30 IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో భాగంగా జాముయి నియోజకవర్గంలోని ఓ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో...

పట్నా (బీహార్): బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో భాగంగా జాముయి నియోజకవర్గంలోని ఓ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పనిచేయలేదు. గ్రామస్థులు ఓటు వేసేందుకు తెల్లవారుజామున 5 గంటల నుంచి బారులు తీరి వేచి ఉన్నా ఈవీఎంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో పోలింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఆగ్రహించి జామియి గ్రామస్థులు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈవీఎంలను బాగు చేయించేందుకు అధికారులు యత్నించినా, తాము మాత్రం ఓట్లు వేయమని గ్రామ ఓటర్లు ప్రకటించి సంచలనం రేపారు.