గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబేకు విదేశాల్లో ఆస్తులున్నా పాస్‌పోర్టు లేదట...

ABN , First Publish Date - 2020-07-18T16:40:25+05:30 IST

కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ అనంతరం అతని బాగోతాలు బయటకు వస్తున్నాయి....

గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబేకు విదేశాల్లో ఆస్తులున్నా పాస్‌పోర్టు లేదట...

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్) : కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ అనంతరం అతని బాగోతాలు బయటకు వస్తున్నాయి.  కరడు కట్టిన కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేకు విదేశాల్లో ఆస్తులున్నా, అతనికి మాత్రం పాస్ పోర్టు మాత్రం లేదని లక్నో ప్రాంతీయ పాస్ పోర్టు అధికారులు తేల్చారు. వికాస్ దూబే పేరిట అతని గ్రామం చిరునామాతో పాస్ పోర్టు లేదని వెల్లడైంది. వికాస్ దూబేకు దుబాయ్, థాయ్ లాండ్ దేశాల్లో ఆస్తులున్నాయని, స్థానిక వ్యాపారి జై బాజ్ పాయ్ ద్వారా నల్లధనాన్ని  విదేశాలకు తరలించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. వికాస్ దూబే కుమారుడు విదేశాల్లో వైద్యవిద్య అభ్యసిస్తున్నాడు. అయితే వికాస్ దూబేకు మాత్రం పాస్ పోర్టు లేదని పాస్ పోర్టు అధికారులు స్పష్టం చేశారు. లక్నో నగరంలోని కృష్ణనగర్ లో వికాస్ దూబేకు చెందిన ఇంటిని లక్నో డెవలప్ మెంటు అథారిటీ అధికారులు సీలు చేశారు. పోలీసులు బిక్రూ గ్రామానికి వచ్చినపుడు వారిని అడ్డుకునేందుకు వీలుగా జేసీబీని అడ్డంగా నిలిపిఉంచిన డ్రైవరును పోలీసులు అరెస్టు చేశారు. 

Updated Date - 2020-07-18T16:40:25+05:30 IST