హోం క్వారంటైన్ ఉల్లంఘనుల కోసం 50 బృందాలు రెడీ

ABN , First Publish Date - 2020-06-19T03:25:07+05:30 IST

హోం క్వారంటైన్ ఉల్లంఘనుల ఆట కట్టించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) 50 నిఘా

హోం క్వారంటైన్ ఉల్లంఘనుల కోసం 50 బృందాలు రెడీ

బెంగళూరు: హోం క్వారంటైన్ ఉల్లంఘనుల ఆట కట్టించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) 50 నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో 15 మంది ఉంటారు. ఈ మేరకు బీబీఎంపీ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించే వారిని తొలుత హెచ్చరిస్తామని, అయినప్పటికీ అదే పనిగా ఉల్లంఘిస్తే మాత్రం ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపుతామని హెచ్చరించారు. అలాగే, వారిపై పోలీసు కేసు కూడా నమోదు చేస్తామని అనిల్ కుమార్ తెలిపారు. 

Updated Date - 2020-06-19T03:25:07+05:30 IST