కొవిడ్ ఎఫెక్ట్... దక్షిణ కొరియా నుంచి విమానాల రాకపోకల రద్దు

ABN , First Publish Date - 2020-03-02T13:01:59+05:30 IST

దక్షిణ కొరియా దేశంలో కొవిడ్-19 సోకిన నేపథ్యంలో ఆ దేశం నుంచి విమానాల రాకపోకలను నిలిపివేయాలని వియత్నాం దేశం నిర్ణయించింది....

కొవిడ్ ఎఫెక్ట్... దక్షిణ కొరియా నుంచి విమానాల రాకపోకల రద్దు

హనోయ్ (వియత్నాం): దక్షిణ కొరియా దేశంలో కొవిడ్-19 సోకిన నేపథ్యంలో ఆ దేశం నుంచి విమానాల రాకపోకలను నిలిపివేయాలని వియత్నాం దేశం నిర్ణయించింది. వియత్నాం దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు దక్షిణ కొరియా విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు వియత్నాం పౌరవిమానయాన శాఖ తాజాగా ప్రకటించింది. కరోనా వైరస్ ప్రబలుతుందనే భయంతో వియత్నాం దేశంలోని హనోయ్ నగరంలోని నోయిబాయి అంతర్జాతీయ విమానాశ్రయం, టాన్ సన్ నహత్ అంతర్జాతీయ విమానాశ్రయాలకు దక్షిణ కొరియా దేశం నుంచి విమానాల రాకపోకలను రద్దు చేసింది. దక్షిణ కొరియా నుంచి వియత్నాం రావాలనుకునే ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిపై డిక్లరేషన్ ఇచ్చి, 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందేలా రావాలని వియత్నాం కోరింది. దక్షిణ కొరియా జాతీయులకు వీసాల జారీని కూడా వియత్నాం నిలిపివేసింది. వియత్నాం దేశంలో కొవిడ్-19  వ్యాధి 16 మందికి వచ్చిందని తేలిన నేపథ్యంలో ఆ దేశం విమానాల రాకపోకల రద్దు నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2020-03-02T13:01:59+05:30 IST