నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

ABN , First Publish Date - 2020-03-28T02:03:36+05:30 IST

ప్రధాన మంత్రి సహాయ నిధికి ఉప రాష్ట్రపతి నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని

నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి సహాయ నిధికి ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడడానికి ప్రకటించారు. వీటితో పాటు కేంద్రం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మద్దతుగా ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ప్రాణాలు హరిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతదేశం టీం ఇండియా స్ఫూర్తిగా ముందుకెళ్తోందని కితాబునిచ్చారు. ఈ దిశలోనే ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు తన వంతుగా చిన్న సహకారాన్ని అందిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి ఆ లేఖలో ప్రస్తావించారు. 

Updated Date - 2020-03-28T02:03:36+05:30 IST