ప్రణబ్ ఆరోగ్యంపై వాకబు చేసిన ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-08-11T18:48:40+05:30 IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు.

ప్రణబ్ ఆరోగ్యంపై వాకబు చేసిన ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీకి ఉపరాష్ట్రపతి ఇవాళ ఫోన్ చేశారని ప్రకటనలో తెలిపింది. ప్రణబ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రణబ్ త్వరగా కోలుకోవాలని వెంకయ్య అభిలషించినట్టుగా ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. 


ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా పూర్త‌యిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న‌ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే, తనకు క‌రోనా సోకిన విషయాన్ని ఆయన ట్వీట్టర్ ద్వారా తెలిపారు. అంతేగాక తనను గత 15 రోజులుగా కలిసిన వారందరినీ పరీక్షలు చేయించుకోవలసిందిగా సూచించారు. 



Updated Date - 2020-08-11T18:48:40+05:30 IST