విఠల్ జీవితం ఎంతోమంది ఐఏఎస్‌లకు ఆదర్శం: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-06-19T21:38:28+05:30 IST

ప్రముఖ ఆర్థిక నిపుణుడు బీపీఆర్ విఠల్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు.

విఠల్ జీవితం ఎంతోమంది ఐఏఎస్‌లకు ఆదర్శం: ఉపరాష్ట్రపతి

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఆర్థిక నిపుణులు బీపీఆర్ విఠల్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని ప్రకటించారు. ‘‘విఠల్ ఇక లేరనే విషయం తీవ్ర విచారకరం. తొలి తరం సివిల్ సర్వీసెస్ అధికారిగా వారు చేసిన కృషి, వారి జీవితం ఎంతో మంది ఐఏఎస్ అధికారులకు స్ఫూర్తిదాయకం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు.Updated Date - 2020-06-19T21:38:28+05:30 IST