శాస్త్రీయ ఆలోచన విధానం నింపాలి

ABN , First Publish Date - 2020-12-30T08:48:15+05:30 IST

యువతలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని నింపాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

శాస్త్రీయ ఆలోచన విధానం నింపాలి

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు


బెంగళూరు, డిసెంబరు 29: యువతలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని నింపాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రజల జీవితం సుఖవంతం, ఆనందమయం చేయడమే సైన్స్‌ అంత మ లక్ష్యమని అన్నారు. మంగళవారం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌  ఆస్ట్రోఫిజిక్స్‌ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఖగోళశాస్త్రం సమాజానికి ఎన్నోవిధాలుగా ప్రయోజనాలు అందించిందని అన్నారు. భూవాతావరణంలో మార్పులు, పరిణామాన్ని అర్థంచేసుకునేందుకు ఖగోళశాస్త్ర పరిశోధనలు సహకరిస్తాయని వెంకయ్యనాయుడు తెలిపారు. ఇక్కడి ఖగోళభౌతికశాస్త్ర సంస్థలోని పర్యావరణ పరీక్ష కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలు అంతరిక్ష రంగం ప్రగతికి సహకరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. 

Updated Date - 2020-12-30T08:48:15+05:30 IST