అటల్ జీ నిజమైన ‘భారతరత్నం’ : ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-08-16T21:53:41+05:30 IST

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా శ్రద్ధాంజలి ఘటించారు.

అటల్ జీ నిజమైన ‘భారతరత్నం’ : ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. సుపరిపాలనాదక్షుడిగా, అనుసంధాన విప్లవ మార్గదర్శిగా, రాజకీయాలకు విలువలు అద్దిన రాజనీతిజ్ఞుడిగా జన హృదయాల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు.  


మాటల్లో చెప్పే విలువలను స్వయంగా పాటించే లక్షణమే వారిని ఆదర్శ నాయకునిగా నిలిపిందన్నారు. వ్యక్తిత్వం, వక్తృత్వం, మితృత్వం, కర్తృత్వం, నేతృత్వాల కలయిక అయిన అటల్ జీ నిజమైన ‘భారతరత్నం’ అని తెలిపారు. వారి క్రమశిక్షణ, చిత్తశుద్ధి, దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. Updated Date - 2020-08-16T21:53:41+05:30 IST