కరోనా భారీ ప్యాకేజీని స్వాగతించిన ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-05-13T16:30:43+05:30 IST

ప్రధాని మోదీ ప్రకటించిన కరోనా భారీ ప్యాకేజీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వాగతించారు.

కరోనా భారీ ప్యాకేజీని స్వాగతించిన ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రకటించిన కరోనా భారీ ప్యాకేజీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు రూ.20లక్షలకోట్ల ప్యాకేజీని ప్రధాని ప్రకటించారని ట్వీట్ చేసిన ఆయన.. వివిధ రంగాల్లో సంస్కరణలతో స్వావలంబన దిశగా భారత్ అడుగులు వేసేందుకు ఈ ప్యాకేజీ ఊపునిస్తుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ‘ఆత్మనిర్భర భారత్’ స్వప్న సాధనకు కఠినమైన సంస్కరణలు తీసుకోవాల్సిన తరుణమిదన్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, సాంకేతికత ఆధారిత వ్యవస్థ, యువత, డిమాండ్ అనే ఐదు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా స్థానిక పరిశ్రమల ఆధారిత అభివృద్ధితో భారత్ అంతర్జాతీయంగా పోటీ పడేలా ప్రోత్సాహం అందుతుందన్నారు. సరైన సమయంలో ప్రకటించిన ఈ ఆర్థిక ప్యాకేజీ.. కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్లను ఎదుర్కునేందుకు, రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులతోపాటు వివిధ వర్గాలకు ఉపయుక్తం అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.  Read more