పశు వైద్యశాలలు తెరిచే ఉంచండి: కేంద్రం

ABN , First Publish Date - 2020-03-25T07:34:32+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పశు వైద్యశాలలు, క్లినిక్స్‌ కూడా పనిచేసేలా వాటికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. పశు వైద్య సేవలు ‘అత్యవసర సేవలే’నని తెలిపింది. ఈ రంగంలో సేవలు కొనసాగించడం...

పశు వైద్యశాలలు తెరిచే ఉంచండి: కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 24: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పశు వైద్యశాలలు, క్లినిక్స్‌ కూడా పనిచేసేలా వాటికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. పశు వైద్య సేవలు ‘అత్యవసర సేవలే’నని తెలిపింది. ఈ రంగంలో సేవలు కొనసాగించడం తప్పనిసరని కేంద్ర పశు సంవర్థక, మత్స్య శాఖ పేర్కొంది. అయితే, ఈ క్రమంలో పశు వైద్యశాలల వద్ద వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, జనాలు గూమికూడకుండా పశు వైద్యులు, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది.

Read more