తేలిపోనున్న నేపాల్‌ ప్రధాని ఓలి భవితవ్యం

ABN , First Publish Date - 2020-07-19T07:39:29+05:30 IST

నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి భవితవ్యం ఆదివారం తేలిపోనుంది. ఆయనకు, మాజీ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌(ప్రచండ) నడుమ అధికారం కోసం జరుగుతున్న గొడవలకు స్వస్తి పలికేందుకు పాలక నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ) అత్యున్నత కమిటీ శనివారం...

తేలిపోనున్న నేపాల్‌ ప్రధాని ఓలి భవితవ్యం

  • నేడు పాలక కమ్యూనిస్టు పార్టీ స్థాయీ సంఘ సమావేశం


కఠ్మాండూ, జూలై 18: నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి భవితవ్యం ఆదివారం తేలిపోనుంది. ఆయనకు, మాజీ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌(ప్రచండ) నడుమ అధికారం కోసం జరుగుతున్న గొడవలకు స్వస్తి పలికేందుకు పాలక నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ) అత్యున్నత కమిటీ శనివారం సమావేశమైంది. ఆదివారం జరిగే స్థాయీ సంఘం సమావేశంలో సమర్పించాల్సిన ఎజెండాపై చర్చించింది. ఇద్దరి మధ్యా అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదర్చడానికి 45మంది అగ్రనేతలతో ఈ సమావేశం జరగనుంది. ఒలి రాజీనామా చేయాలని ప్రచండతో సహా ఎన్‌సీపీ అగ్రనేతలు చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు. భారత్‌తో ఓలి వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా, దౌత్యపరంగా సరైనది కాదని అంటున్నారు. ఆయన నిరంకుశ శైలిపై కూడా మండిపడుతున్నారు. కలాపాని, లిపులేఖ్‌, లింపియాధురాలను తమవిగా పేర్కొంటూ నేపాల్‌ మ్యాప్‌ను విడుదల చేసిన తర్వాత ఓలి, ప్రచండ వర్గాల మధ్య వివాదాలు మరింత చెలరేగాయి. మొత్తానికి ఈ సమావేశంలో వివాదాలు ఓ కొలిక్కి రానున్నాయని స్థాయీ సంఘం సభ్యుడు గణేష్‌ షా పేర్కొన్నారు.


Updated Date - 2020-07-19T07:39:29+05:30 IST