29న బెంగళూరుకు ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-12-27T17:21:26+05:30 IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 29న నగరానికి రానున్నారు.

29న బెంగళూరుకు ఉపరాష్ట్రపతి

బెంగళూరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 29న నగరానికి రానున్నారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. విజయవాడ విమానాశ్రయం నుంచి ఉపరాష్ట్రపతి ఉదయం 9 గంటలకు బయల్దేరి 10 గంటలకు హెచ్‌ఏఎల్‌ వీఐపీ విమానాశ్రాయానికి చేరుకుంటారు. నేరుగా హొస్కొటెలోని సెంటర్‌ ఫర్‌ రీసెర్చి, ఎడ్యుకేషన్‌ ఇన్‌ సైన్స్‌ టెక్నాలజీకి చేరుకుని అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.


ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అస్ట్రోఫిజిక్స్‌లో స్పేస్‌ క్వాలిఫికేషన్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. ఉపరాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ వాజుభాయ్‌వాలా విందు ఏర్పాటు చేయనున్నారు. 30న కూడా రాజ్‌భవన్‌లోనే బసచేసే ఉపరాష్ట్రపతితో పలువురు ప్రముఖులు భేటీ కానున్నారు. 31న ఉదయం 8 గంటలకు ఆయన చెన్నైకు బయల్దేరి వెళతారు.

Updated Date - 2020-12-27T17:21:26+05:30 IST