స్వయం మహిళలకు వెంకయ్య అభినందనలు

ABN , First Publish Date - 2020-05-13T07:36:47+05:30 IST

కరోనా యోధులకు సహాయంగా తమ విలువైన భాగస్వామ్యాన్ని అందిస్తున్న స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. దేశవ్యాప్తంగా లక్షల మంది స్వయం మహిళలు...

స్వయం మహిళలకు వెంకయ్య అభినందనలు

న్యూఢిల్లీ, మే 12(ఆంధ్రజ్యోతి): కరోనా యోధులకు సహాయంగా తమ విలువైన భాగస్వామ్యాన్ని అందిస్తున్న స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. దేశవ్యాప్తంగా లక్షల మంది స్వయం మహిళలు 10కోట్ల మాస్కులు, 2 లక్షలకు పైగా గ్లౌజులు, టోపీలు, బూట్ల కవర్లను తయారు చేశారని ట్వీట్‌ చేశారు.  కాగా, ఉప రాష్ట్రపతి సచివాలయం ఏర్పడి 68 ఏళ్లు పూర్తైన సందర్భంగా అధికారులు, సిబ్బందికి ఉప రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు.

Read more