విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి: వెంకయ్య

ABN , First Publish Date - 2020-03-27T06:25:12+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా హాస్టళ్లు మూసేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దుల్లో చిక్కుకున్న విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి...

విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి: వెంకయ్య

లాక్‌డౌన్‌ కారణంగా హాస్టళ్లు మూసేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దుల్లో చిక్కుకున్న విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని, రోజువారీ అవసరాలకు సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. అలాగే హాస్టల్‌ మెస్‌లు తెరిచి ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు వాటికి నిత్యవసరాలు అందేలా చూడాలని కోరారు.

Updated Date - 2020-03-27T06:25:12+05:30 IST