భారత ఐక్యతా స్ఫూర్తి సర్దార్ వల్లభభాయ్ పటేల్: వెంకయ్య

ABN , First Publish Date - 2020-10-31T21:42:43+05:30 IST

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ఐక్యత లేని మానవశక్తి సామర్థ్యం కాజాలదు. సక్రమంగా ఐక్యం కావడం ద్వారా అది ఆధ్యాత్మిక శక్తిగా పరిపుష్టం

భారత ఐక్యతా స్ఫూర్తి సర్దార్ వల్లభభాయ్ పటేల్: వెంకయ్య

ఢిల్లీ: సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ఐక్యత లేని మానవశక్తి సామర్థ్యం కాజాలదు. సక్రమంగా ఐక్యం కావడం ద్వారా అది ఆధ్యాత్మిక శక్తిగా పరిపుష్టం అవుతుంది. సర్దార్ పటేల్ ఉక్కు మనిషి, భారత ఐక్యతా స్ఫూర్తి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. భారత స్వరాజ్య సంగ్రామంలో సర్దార్ పటేల్ పాత్ర, 500కి పైగా రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్‌లో విలీనం చేయడం, సివిల్ సర్వీసుల రూపకల్పన లాంటివి అందించిన ఆ నవీన భారత నిర్మాతకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఐక్యత, సమగ్రత మరియు భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రతిన బూనుదాం’ అంటూ ట్వీట్ చేశారు.
Read more