అమెరికా తెలుగు అమ్మాయికి ఉపరాష్ట్రపతి ప్రశంసలు

ABN , First Publish Date - 2020-10-20T02:39:28+05:30 IST

14 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం ఆనందదాయకమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు.

అమెరికా తెలుగు అమ్మాయికి ఉపరాష్ట్రపతి ప్రశంసలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రోటీన్‌ను బంధించి, దాన్ని నియంత్రించే అణువును రూపొందించిన అమెరికా తెలుగు విద్యార్థిని అనిక చేబ్రోలుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. 14 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం ఆనందదాయకమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు.


‘‘టెక్సాస్‌కు చెందిన 14ఏళ్ల భారత సంతతి అమెరికా తెలుగు విద్యార్థిని అనిక చేబ్రోలు.. 2020వ ఏడాదికి గానూ 3ఎం యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ అవార్డును గెలుచుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాల విద్యార్థిని.. కరోనా వైరస్ ప్రోటీన్‌ను బంధించి దాన్ని నియంత్రించే అణువును రూపొందించడం, ఇందుకుగానూ.. 25వేల డాలర్ల ప్రోత్సాహాన్ని అందుకోవడం ప్రశంసనీయం’’ అని తెలుగులో ట్వీట్ చేశారు.

Updated Date - 2020-10-20T02:39:28+05:30 IST