నేపాలీ యువ‌కునికి గుండు ఉదంతంలో వాస్త‌వం వెల్ల‌డి!

ABN , First Publish Date - 2020-07-19T10:36:49+05:30 IST

నేపాలీ యువకునికి బ‌ల‌వంతంగా గుండు చేయించిన ఉదంతంలో అస‌లు విష‌యం తెలుసుకున్న వారణాసి పోలీసులు షాక‌య్యారు. ఆ యువకుడు నేపాలీ కాద‌ని, భారతీయుడని వారణాసి పోలీసులు...

నేపాలీ యువ‌కునికి గుండు ఉదంతంలో వాస్త‌వం వెల్ల‌డి!

వార‌ణాసి: నేపాలీ యువకునికి బ‌ల‌వంతంగా గుండు చేయించిన ఉదంతంలో అస‌లు విష‌యం తెలుసుకున్న వారణాసి పోలీసులు షాక‌య్యారు. ఆ యువకుడు నేపాలీ కాద‌ని, భారతీయుడని వారణాసి పోలీసులు వెల్ల‌డించారు. అలాగే అతను వారణాసిలోనే జన్మించాడ‌ని కూడా చెప్పారు. ఆ యువకుని ఆధార్, ఓటరు ఐడి కార్డు కూడా వారణాసికి చెందినవని పోలీసులు తెలిపారు. వెయ్యి రూపాయ‌లు తీసుకుని ఆ యువ‌కుడు నేపాలీగా నాట‌క‌మాడాడ‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ఉదంతంలో హస్త‌మున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఆ వీడియోలో ఉన్న వ్య‌క్తిని తాము గుర్తించామ‌ని వారణాసి ఎస్‌ఎస్‌పి అమిత్ పాఠ‌క్ చెప్పారు. అతను వారణాసిలోని జల్ సంస్థాన్ ప్రభుత్వ కాలనీలో ఉంటున్నాడ‌న్నారు. ఆ యువ‌కుని త‌ల్లిదండ్రులిద్ద‌రూ ప్రభుత్వ ఉద్యోగుల‌ని తెలిపారు. అత‌నికి వీడియో తీసిన‌ వారితో పరిచయం ఉన్నట్లు విచార‌ణ‌లో వెల్ల‌డ‌య్యింద‌న్నారు.

Updated Date - 2020-07-19T10:36:49+05:30 IST