30న వూహాన్‌కు ‘వందే భారత్’ విమానం
ABN , First Publish Date - 2020-10-24T08:42:18+05:30 IST
కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలోని వూహాన్లో చిక్కుకున్న భారతీయులను భారత్ స్వదేశానికి తీసుకువెళ్లనుంది...

బీజింగ్, అక్టోబరు 23: కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలోని వూహాన్లో చిక్కుకున్న భారతీయులను భారత్ స్వదేశానికి తీసుకువెళ్లనుంది. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఈ నెల 30న ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వూహాన్‌కు చేరుకోనుందని ఇక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. వివరాలకు helpdesk.beijing@mea.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని పేర్కొంది.