వాహన పత్రాల చెల్లుబాటు మార్చి 31 వరకు

ABN , First Publish Date - 2020-12-28T07:53:28+05:30 IST

డ్రైవింగ్‌ లైసెన్స్‌ (డీఎల్‌), రిజిస్ర్టేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీ), పర్మిట్లు వంటి మోటార్‌ వాహన పత్రాల చెల్లుబాటు గడువును 2021 మార్చి 31 వరకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పొడిగించింది...

వాహన పత్రాల చెల్లుబాటు మార్చి 31 వరకు

న్యూఢిల్లీ, డిసెంబరు 27: డ్రైవింగ్‌ లైసెన్స్‌ (డీఎల్‌), రిజిస్ర్టేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీ), పర్మిట్లు వంటి  మోటార్‌ వాహన పత్రాల చెల్లుబాటు గడువును 2021 మార్చి 31 వరకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పొడిగించింది. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఆదివారం తెలియజేసింది. కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పైన పేర్కొన్న పత్రాలు మార్చి 31 వరకు చెల్లుబాటు అయ్యేవిగా అధికారులు పరిగణించాలని పేర్కొంది.

Updated Date - 2020-12-28T07:53:28+05:30 IST