నేటి నుంచి వైష్ణోదేవి యాత్ర

ABN , First Publish Date - 2020-08-16T07:13:18+05:30 IST

కరోనాతో 5 నెలలు నిలిచిపోయిన వైష్ణోదేవి యాత్ర ఆదివారం తిరిగి ప్రారంభం కానుంది. ఈ యాత్రను మార్చి 18న అధికారు లు నిలిపివేశారు. తొలివారంలో రోజూ గరిష్ఠంగా 2 వేల మంది యాత్రికుల నే అనుమతిస్తామని శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం...

నేటి నుంచి వైష్ణోదేవి యాత్ర

జమ్ము, ఆగస్టు 15: కరోనాతో 5 నెలలు నిలిచిపోయిన వైష్ణోదేవి యాత్ర ఆదివారం తిరిగి ప్రారంభం కానుంది. ఈ యాత్రను మార్చి 18న అధికారులు నిలిపివేశారు. తొలివారంలో రోజూ గరిష్ఠంగా 2 వేల మంది యాత్రికులనే అనుమతిస్తామని శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు సీఈవో రమేశ్‌ కుమార్‌ తెలిపారు. జమ్మూకశ్మీరు నుంచి 1900 మందిని, బయటి ప్రాంతా లకు చెందిన 100మంది భక్తులను అనుమతిస్తామన్నారు. తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణమని తీసుకుంటామని చెప్పారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారినే అనుమతిస్తామని పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-16T07:13:18+05:30 IST