854 కోట్లతో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం

ABN , First Publish Date - 2020-05-18T09:04:10+05:30 IST

కరోనా వైర్‌సపై యుద్ధానికి విస్తృత ప్రణాళికల్లో భాగంగా బ్రిటన్‌ రూ.854 కోట్ల(93 మిలియన్‌ పౌండ్లు)తో కొత్తగా వ్యాక్సిన్‌ తయారీ-ఇన్నోవేషన్‌ కేంద్రం(వీఎంఐసీ)ను నిర్మిస్తోంది. భారత సంతతికి చెందిన బ్రిటన్‌ వాణిజ్య, ఇంధన, పరిశ్రమలశాఖ సహాయమంత్రి...

854 కోట్లతో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం

  • బ్రిటన్‌ మంత్రి అలోక్‌ శర్మ

లండన్‌, మే 17: కరోనా వైర్‌సపై యుద్ధానికి విస్తృత ప్రణాళికల్లో భాగంగా బ్రిటన్‌ రూ.854 కోట్ల(93 మిలియన్‌ పౌండ్లు)తో కొత్తగా వ్యాక్సిన్‌ తయారీ-ఇన్నోవేషన్‌ కేంద్రం(వీఎంఐసీ)ను నిర్మిస్తోంది. భారత సంతతికి చెందిన బ్రిటన్‌ వాణిజ్య, ఇంధన, పరిశ్రమలశాఖ సహాయమంత్రి అలోక్‌ శర్మ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. వీఎంఐసీలో ప్రభుత్వ పెట్టుబడులే రూ.348 కోట్లు(38 మిలియన్‌ పౌండ్లు) ఉంటాయని, ఏడాదిలోపే వీఎంఐసీని ప్రారంభించే లా వేగంగా పెట్టుబడులు సమీకరిస్తున్నామని చెప్పారు. యూకే మొత్తం జనాభాకు 6నెలల పాటు వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం వీఎంఐసీకి ఉంటుందన్నారు. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని హార్‌వెల్‌ సైన్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ లో వీఎంఐసీని నిర్మిస్తున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్‌ల ఉత్పత్తికి ఇది యూకేలోనే తొలి నాన్‌-ప్రాఫిట్‌ సంస్థ అవుతుంద న్నారు.


Updated Date - 2020-05-18T09:04:10+05:30 IST