వ్యాక్సినేషన్‌కు పీహెచ్‌సీలు, పైస్థాయి ఆస్పత్రులు

ABN , First Publish Date - 2020-12-20T08:35:39+05:30 IST

సార్వత్రిక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల(యూఐపీ) కోసం దేశంలో ఇప్పటికే 81.87 లక్షల వ్యాక్సినేషన్‌ కేంద్రాలున్నాయి. అయితే తొలి

వ్యాక్సినేషన్‌కు పీహెచ్‌సీలు, పైస్థాయి ఆస్పత్రులు

న్యూఢిల్లీ, డిసెంబరు 19: సార్వత్రిక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల(యూఐపీ) కోసం దేశంలో ఇప్పటికే 81.87 లక్షల వ్యాక్సినేషన్‌ కేంద్రాలున్నాయి. అయితే తొలి విడతలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకే కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నందున వాటన్నింటినీ వాడాల్సిన అవసరం రాకపోవచ్చు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు(సీహెచ్‌సీ), సబ్‌ డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్స్‌(ఎస్‌డీహెచ్‌), జిల్లా కేంద్ర ఆస్పత్రులు, పట్టణాలు, నగరాల్లోని ఆస్పత్రులనే తొలి దశలో వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రతి వ్యాక్సినేషన్‌ కేంద్రంలో 3 గదులు ఉండేలా.. వాటిలో ఒకదాన్ని వెయిటింగ్‌/అబ్జర్వేషన్‌కు కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు వైద్యుల పర్యవేక్షణ నిమిత్తం ఈ గదిలో అరగంట పాటు ఉండాలి. \


6 నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌

వచ్చే 6, 7 నెలల్లో 30కోట్ల మందికిపైగా దేశ ప్రజలకు వ్యాక్సినేషన్‌ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. కొవిడ్‌పై ఏర్పాటైన మంత్రుల అత్యున్నత స్థాయి బృందం(జీవోఎం) 22వ సమావేశంలో శనివా రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. భారత్‌లో కరోనా మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 1.45ు మేర ఉందన్నారు. అక్టోబరు, నవంబరు నెలల్లో పండగల సీజన్‌ ఉన్నా కేసులు అంతగా పెరగలేదన్నారు. కరోనా వ్యాక్సిన్ల కోసం 12 దేశాల నుంచి భారత్‌కు విజ్ఞప్తులు అందాయని తెలిపారు.

Updated Date - 2020-12-20T08:35:39+05:30 IST