ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆసుపత్రులు..!
ABN , First Publish Date - 2020-03-24T14:48:25+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 100కు పైగా పడకలు ఉన్న అన్ని ప్రభుత్వ ..

డెహ్రాడూన్: కరోనా వైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 100కు పైగా పడకలు ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు తమ కంట్రోల్‌లోకి తీసుకుని, వాటిలో 25 శాతం పడకలు కోవిడ్-19 రోగులకు కేటాయించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక అధికార ప్రకటన వెలువడింది. ప్రపచం వ్యాప్తంగా 3,30,000 మంది కరోనా బారిన పడగా, మృతుల సంఖ్య 14,000కు చేరింది.