కోవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. లక్ష

ABN , First Publish Date - 2020-06-05T00:22:08+05:30 IST

కోవిడ్ మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలని ఉత్తరాఖండ్

కోవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. లక్ష

డెహ్రాడూన్: కోవిడ్ మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ప్రకటించారు. రాష్ట్రంలో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. కాగా, శని, ఆదివారాల్లో రాజధాని డెహ్రాడూన్‌ను శానిటైజేషన్ కోసం పూర్తిగా మూసివేయనున్నట్టు సీఎం పేర్కొన్నారు. కాగా, గురువారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,145కు చేరుకున్నట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 

Updated Date - 2020-06-05T00:22:08+05:30 IST