అత్యాచార బాధితురాలు మోదీకి లేఖ

ABN , First Publish Date - 2020-10-03T13:48:02+05:30 IST

తనపై అత్యాచారం చేసిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహేష్ నేగిపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ డిమాండు చేశారు...

అత్యాచార బాధితురాలు మోదీకి లేఖ

అత్యాచారం కేసులో నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యేపై చర్యకు డిమాండ్

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) : తనపై అత్యాచారం చేసిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహేష్ నేగిపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ డిమాండు చేశారు.ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బాధితురాలు సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.ఈ కేసులో ఉత్తరాఖండ్ బీజేపీ సర్కారు, పోలీసులు కాపాడేందుకు యత్నిస్తున్నారని, దీనిపై దర్యాప్తు జరిపి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ప్రధానికి బాధితురాలు 4పేజీల లేఖ రాశారు. ఈ ఘటనపై దర్యాప్తు అధికారిని మార్చాలని బాధితురాలు కోరారు. 


‘‘నిందితుడైన ఎమ్మెల్యేను రక్షించే ప్రయత్నంలో పోలీసులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని, క్లియింటుతో రాజీ కుదుర్చుకోవాలని కోరారు...ఈ ఘటనపై న్యాయమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపించండి’’ అంటూ బాధితురాలు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.కాగా దీనిపై ఉత్తరాఖండ్ పోలీసులు ఖండిస్తున్నారు.

Updated Date - 2020-10-03T13:48:02+05:30 IST