ఉత్తరాఖండ్‌లో బీజేపీ కౌన్సిలర్ కాల్చివేత

ABN , First Publish Date - 2020-10-12T18:03:32+05:30 IST

ఉత్తరాఖండ్ బీజేపీ కౌన్సిలరును సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు....

ఉత్తరాఖండ్‌లో బీజేపీ కౌన్సిలర్ కాల్చివేత

రుద్రాపూర్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ బీజేపీ కౌన్సిలరును సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఉధంసింగ్ నగర్ జిల్లా రుద్రాపూర్ పట్టణంలోని ఇంటి వద్దకు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి బీజేపీ కౌన్సిలర్ ప్రకాష్ ధమీపై కాల్పులు జరిపి పారిపోయారు. రుద్రాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భదాయ్ పురా ఆగ్రసేన్ నగర్ ప్రాంతంలోని ప్రకాష్ ధమీ ఇంటికి ఉదయం 8 గంటలకు వచ్చిన దుండగులు అతన్ని కాల్చి చంపి పారిపోయారు.


ప్రకాష్ పారిపోయేందుకు యత్నించినా దుండగులు వెంటాడి కాల్చారని ఎస్పీ దిలీప్ సింగ్ చెప్పారు. బుల్లెట్ గాయాలైన ధమీని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పారు. 2018లో కౌన్సిలరుగా ఎన్నికైన ప్రకాష్ బీజేపీతో చేరారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారు.

Updated Date - 2020-10-12T18:03:32+05:30 IST