భారీ వ‌ర్షాల‌కు భ‌వ‌నం కూలి ము‌గ్గురు మృతి

ABN , First Publish Date - 2020-07-15T15:12:07+05:30 IST

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని చుక్కువాలా ప్రాంతంలో భారీ వర్షాల‌కు ఒక భవ‌నం కూలింది. సమాచారం అందుకున్న ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం ఇప్పటివరకు ఆరుగురిని శిథిలాల నుంచి....

భారీ వ‌ర్షాల‌కు భ‌వ‌నం కూలి ము‌గ్గురు మృతి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని చుక్కువాలా ప్రాంతంలో భారీ వర్షాల‌కు ఒక భవ‌నం కూలింది. సమాచారం అందుకున్న ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం ఇప్పటివరకు ఆరుగురిని శిథిలాల నుంచి బయటకు తీసుకువ‌చ్చింది. వారిలో ముగ్గురు అప్పటికే మృతిచెంద‌గా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్ర‌స్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శిధిలాల కింద ఇంకా ప‌లువు‌రు ఉన్నార‌ని తెలుస్తోంది. వారిని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకు రెస్క్యూ బృందం ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కాగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేప‌ధ్యంలో రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లోని 54 రోడ్లు పూర్తిగా పాడ‌య్యాయి. ఈ రోడ్ల మ‌ర‌మ్మ‌తు ప‌నులు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. 

Updated Date - 2020-07-15T15:12:07+05:30 IST