ఆగ్రాలో కొనసాగుతున్న ఎంఎల్సీ ఎన్నికల పోలింగ్
ABN , First Publish Date - 2020-12-01T15:40:00+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈరోజు ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈరోజు ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆగ్రా జిల్లాలో మొత్తం 84 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కంపు ఈనెల 3న జరగనుంది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి యోగేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతీ పోలింగ్ కేంద్రంలోనూ మైక్రో అబ్జర్వర్ నిఘా సారిస్తారన్నారు.