మాస్కులు ధరించకుంటే చలాన్లు విధించండి

ABN , First Publish Date - 2020-10-07T16:13:16+05:30 IST

మాస్కులు ధరించని వారు, సామాజిక దూరం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని...

మాస్కులు ధరించకుంటే చలాన్లు విధించండి

పోలీసులకు అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఆదేశం

లక్నో (ఉత్తరప్రదేశ్): మాస్కులు ధరించని వారు, సామాజిక దూరం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మాస్కులు ధరించని, సామాజిక దూరం నిబంధనలు పాటించని వారికి  చలాన్లు విధించాలని యూపీ రాష్ట్ర అదనపు ప్రధానకార్యదర్శి నవనీత్ సెహగల్ పోలీసులను ఆదేశించారు. యూపీలో అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, దీన్ని ఉల్లంఘించిన వారికి చలాన్లు జారీ చేస్తామని యోగి నేతృత్వంలోని యూపీ సర్కారు ట్విట్టరులో హెచ్చరించింది.


యూపీలో మాస్కులు ధరించని వారికి మొదటి, రెండవ నేరాలకు 100 రూపాయల జరిమానా, మూడవసారి 500రూపాయల జరిమానా విధించాలని సర్కారు నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసిన వారిపై కూడా జరిమానా విధించాలని సర్కారు నిర్ణయించింది. యూపీలో 4,17,437 మందికి కరోనా సోకగా, వారిలో 6092 మంది మరణించారు.కరోనా కట్టడి కోసం యూపీ సర్కారు కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. 

Read more