ఫ్లాష్..ఫ్లాష్...ఉజ్జయిని దేవాలయంలో గ్యాంగస్టర్ వికాస్ దూబే అరెస్ట్
ABN , First Publish Date - 2020-07-09T15:40:08+05:30 IST
కాన్పూర్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబేను గురువారం ఉదయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో పోలీసులు అరెస్టు చేశారు.
ఉజ్జయిని (మధ్యప్రదేశ్): కాన్పూర్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబేను గురువారం ఉదయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో పోలీసులు అరెస్టు చేశారు. బిక్రూ గ్రామంలో తనను పట్టుకునేందుకు వచ్చిన 8మంది పోలీసులను హతమార్చి పారిపోయిన కరడుకట్టిన నేరగాడు వికాస్ దూబే ఉజ్జయిని నగరంలోని మహాకాళీ దేవాలయంలో పూజలు చేసేందుకు రావడంతో అక్కడి గార్డు అతన్ని పట్టుకున్నారు. వికాస్ దూబేను పట్టుకున్న అనంతరం.. ఈ విషయాన్ని ఉజ్జయిని జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. దీంతో ఉజ్జయిని పోలీసులు వికాస్ దూబేను తమ కస్టడీలోకి తీసుకున్నారు. వికాస్ దూబే అరెస్టు గురించి మధ్యప్రదేశ్ డీజీపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సమాచారం అందించారు. దీంతో సీఎం చౌహాన్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు తెలిపారు. ఉజ్జయిని పోలీసులు వికాస్ దూబేను రహస్య ప్రాంతంలో దాచి ఉంచారు.