టిక్‌టాక్‌పై నిర్ణయం మార్చుకునేది లేదు.. తేల్చేసిన అమెరికా

ABN , First Publish Date - 2020-07-09T04:37:20+05:30 IST

చైనా కంపెనీలయిన హువాయి, టిక్‌టాక్‌పై తమ నిర్ణయంలో ఎటువంటి మార్పూ చేయబోమని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్పష్టంచేశారు.

టిక్‌టాక్‌పై నిర్ణయం మార్చుకునేది లేదు.. తేల్చేసిన అమెరికా

వాషింగ్టన్: చైనా కంపెనీలయిన హువాయి, టిక్‌టాక్‌పై తమ నిర్ణయంలో ఎటువంటి మార్పూ చేయబోమని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్పష్టంచేశారు. హువాయి, టిక్‌టాక్ వంటి చైనీస్ సంస్థలు అమెరికా భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని, ఇలాంటి వాటిపై తమ ప్రభుత్వం చాలా కఠినమైన నిబంధనలు అవలంబిస్తుందని ఆయన చెప్పారు. హువాయి వంటి సంస్థలకు వ్యతిరేకంగా నిలబడటం ద్వారా తాము అమెరికా ప్రభుత్వ విలువలను కాపాడుతున్నామని, చైనా చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా టిక్‌టాక్‌ను దేశంలో నిషేధించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-07-09T04:37:20+05:30 IST