భారత్-చైనా మధ్య శాంతికి కృషి చేస్తా: ట్రంప్
ABN , First Publish Date - 2020-07-18T09:12:58+05:30 IST
భారత్-చైనా మధ్య పరిస్థితిని చక్కదిద్దడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకొచ్చారు. ఇరుదేశాల మధ్య శాంతి

వాషింగ్టన్, జూలై 17: భారత్-చైనా మధ్య పరిస్థితిని చక్కదిద్దడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకొచ్చారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ‘భారత ప్రజలపై నాకు ఎనలేని ప్రేమ. చైనా ప్రజలన్నా అంతే. ఇరుదేశాల మధ్య శాంతికి సాధ్యమైనంత మేరకు కృషి చేస్తా’ అని ట్రంప్ పేర్కొన్నట్టు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కేలీ మెకానీ చెప్పారు. భారత్-చైనా సరిహద్దు వివాదంలో ట్రంప్ వైఖరి ఏమిటని విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆమె బదులిచ్చారు. కాగా, చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను ప్రపంచం తిప్పికొట్టాల్సిన తరుణం వచ్చిందని విదేశాంగ మంత్రి మైక్‌పాంపియో అన్నారు.