‘లేజర్ వెపన్’ను పరీక్షించిన యూఎస్ నేవీ
ABN , First Publish Date - 2020-05-24T08:26:37+05:30 IST
ఎయిర్ క్రాఫ్ట్ మిడ్ ఫ్లయిట్‌ను ధ్వంసం చేసే ‘లేజర్ వెపన్’ను ఆమెరికా నేవీ విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు శుక్రవారం నేవీ అధికారులు...

వాషింగ్టన్ మే 23: ఎయిర్ క్రాఫ్ట్ మిడ్ ఫ్లయిట్‌ను ధ్వంసం చేసే ‘లేజర్ వెపన్’ను ఆమెరికా నేవీ విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు శుక్రవారం నేవీ అధికారులు ప్రకటనను విడుదల చేశారు. ఏరియల్ డ్రోన్ ఎయిర్ క్రాఫ్ట్‌ను అడ్డుకోవడానికి ‘హై ఎనర్జీ క్లాస్ సాలిడ్ స్టేట్ లేజర్’ విధానాన్ని అమెరికన్ నేవీ ఉపయోగించడం ఇదే తొలిసారి. అయితే లేజర్ వెపన్స్ సిస్టమ్ డెమాన్స్స్ట్రేటర్(ఎల్డబ్ల్యూఎ్సడి) ప్రాంతాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. మే 16న పసిఫిక్ తీర ప్రాంతంలో ప్రయోగించినట్లు మాత్రం నేవీ తెలిపింది.