ఇక నా జీవితం ఇక్కడే.. హైకోర్టును ఆశ్రయించిన అమెరికా టూరిస్ట్!
ABN , First Publish Date - 2020-07-08T23:26:43+05:30 IST
ప్రయాణ ఆంక్షల కారణంగా భారత్‌లో చిక్కుకున్న విదేశీయులంతా తమ దేశాలకు వెళ్లేందుకు తహతహలాడుతుంటే..

తిరువనంతపురం: ప్రయాణ ఆంక్షల కారణంగా భారత్‌లో చిక్కుకున్న విదేశీయులంతా తమ దేశాలకు వెళ్లేందుకు తహతహలాడుతుంటే.. 74 ఏళ్ల ఓ అమెరికా టూరిస్టు మాత్రం తనను ఇక్కడే ఉండనివ్వాలంటూ న్యాయపోరాటానికి దిగాడు. ఐదు నెలల పాటు కేరళలో నివాసం తనకు ఎనలేని మనశ్శాంతిని ఇచ్చిందనీ.. ఇక జీవితాంతం ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నానని జానీ పాల్ పియర్స్ అనే వృద్ధుడు కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. తన టూరింగ్ వీసాను బిజినెస్ వీసాగా మార్చునేందుకు అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థించాడు.
‘‘ఏదైనా ఆచరణీయమైన వ్యాపార నమూనాను చూపించి.. ఐదేళ్ల వ్యాపార వీసా పొందాలన్నది నా ఆకాంక్ష. భారత అమ్మాయిని వివాహం చేసుకుంటే ఇక్కడ సులభంగా పౌరసత్వం పొందవచ్చుకానీ.. 74 ఏళ్ల నాకు ఇప్పుడు ఆ అవకాశం లేదు...’’ అని పియర్స్ పేర్కొన్నారు. కేరళలో విదేశీయుల కోసం ఓ రిజువనేషన్ సెంటర్ ప్రారంభించాలని అనుకుంటున్నట్టు ఈ పెద్దాయన తెలిపారు. ‘‘అమెరికాలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. నాకు కేరళ అంటే చాలా ఇష్టం. నాకు వెనక్కి వెళ్లాలని లేదు. ఇక్కడే ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను..’’ అని పియర్స్ పేర్కొన్నారు.