లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి 600 ఏళ్ల జైలు శిక్ష
ABN , First Publish Date - 2020-10-03T23:15:44+05:30 IST
లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి 600 ఏళ్ల జైలు శిక్ష

టుస్కాలోసా: అమెరికాలోని అలబామాలో 32 ఏళ్ల వ్యక్తికి న్యాయమూర్తి 600 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.ఇద్దరు పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి 600 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. యూఎస్ జిల్లా న్యాయమూర్తి స్కాట్ కూగ్లర్ కాటన్‌డేల్‌కు చెందిన మాథ్యూ టైలర్ మిల్లెర్ (32)కు జీవిత ఖైదు విధించారు. ఈ సంఘటనలు జరిగినప్పుడు ఇద్దరు బాధితులు 4 సంవత్సరాల వయస్సులో ఉన్నారని అధికారులు వెల్లడించారు. నిందితుడి నుంచి 102 అశ్లీల చిత్రాలను గుర్తించామని చెప్పారు. నిందితుడు మిల్లెర్ 2019 అక్టోబర్‌లో నేరాన్ని అంగీకరించాడు. 12 కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో లైంగిక సంబంధం కలిగి ఉందని ఆరోపించారు.