కరోనా వ్యాక్సీన్ దాదాపు రెడీ?.. అమెరికా కంపెనీ ప్రకటన!

ABN , First Publish Date - 2020-05-19T04:23:50+05:30 IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టే రోజులు దగ్గరపడినట్లే కనిపిస్తోంది.

కరోనా వ్యాక్సీన్ దాదాపు రెడీ?.. అమెరికా కంపెనీ ప్రకటన!

వాషింగ్టన్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టే రోజులు దగ్గరపడినట్లే కనిపిస్తోంది. అమెరికాకు చెందిన మోడర్నా అనే బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సీన్‌ను మనుషులపై ప్రయోగించగా.. మంచి ఫలితాలు వచ్చాయట. ‘ఎమ్‌ఆర్‌ఎన్‌ఏ-1273’ అనే ఈ వ్యాక్సీన్‌ హ్యూమన్ ట్రయల్స్‌లో పాజిటివ్ ఫలితాలొచ్చాయని, మూడు రకాల డోసులతో ప్రయోగం జరపగా.. వలంటీర్ల ఆరోగ్యంలో దానికి తగ్గట్టే మార్పులొచ్చాయని పరిశోధకులు తెలిపారు. అయితే ఇదంతా ఫేస్-1 ప్రయోగమేనని, ఇంకొన్ని పరీక్షల తర్వాతగానీ కచ్చితమైన సమాచారం చెప్పలేమని వారు పేర్కొన్నారు.

Updated Date - 2020-05-19T04:23:50+05:30 IST