భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం.. క్షిపణుల విక్రయానికి అమెరికా ఓకే!

ABN , First Publish Date - 2020-04-15T02:08:03+05:30 IST

భారతదేశానికి 155 మిలియన్ డాలర్ల విలువైన హర్పూన్ బ్లాక్ 2 ఎయిర్ లాంచ్‌డ్ మిసైళ్లు, తేలికపాటి

భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం.. క్షిపణుల విక్రయానికి అమెరికా ఓకే!

వాషింగ్టన్: భారతదేశానికి 155 మిలియన్ డాలర్ల విలువైన హర్పూన్ బ్లాక్ 2 ఎయిర్ లాంచ్‌డ్ మిసైళ్లు, తేలికపాటి టార్పొడోలు విక్రయించాలని నిర్ణయించినట్టు ట్రంప్ ప్రభుత్వం నిన్న అమెరికన్ కాంగ్రెస్‌కు తెలియజేసింది. పది ఏజీఎం-84 ఎల్ హర్పూన్ బ్లాక్ 2 ఎయిర్ లాంచ్‌డ్ మిసైళ్ల ఖరీదు దాదాపు 92 మిలియన్ డాలర్లు కాగా, 16 ఎంకే 54 ఆల్ అప్ రౌండ్ తేలికపాటి టార్పొడోలు, మూడు ఎంకే 54 ఎక్సర్‌సైజ్ ఎంకే 54 టార్పొడోల ఖరీదు   63 మిలియన్ డాలర్లుగా డిఫెన్స్ సెక్యూరిటీ కార్పొరేషన్ ఏజెన్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లలో సభకు తెలియజేసింది. భారత ప్రభుత్వం ఇటీవల ఈ రెండింటి కోసం చేసిన అభ్యర్థన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పెంటగాన్ తెలిపింది. తాము అందించే ఈ రక్షణ వ్యవస్థలతో భారత్ మరింత బలోపేతం అవుతుందని, ప్రాంతీయ బెదిరింపులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పెంటగాన్ పేర్కొంది. భారత్ తన అమ్ముల పొదిలోకి వీటిని తీసుకెళ్లేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపింది.   

Updated Date - 2020-04-15T02:08:03+05:30 IST